వ‌రంగ‌ల్‌ ఎంజీఎం ఆసుప‌త్రిలో ఎలుక‌లు!.. ఐసీయూలో రోగిని కొరికేసిన వైనం!

  • ఎంజీఎంలో రోగి కాలును కొరికేసిన ఎలుక‌లు
  • ఘ‌ట‌న‌పై ప‌లు టీవీ ఛానెళ్ల‌లో క‌థ‌నాలు
  • త‌క్ష‌ణ‌మే స్పందించిన మంత్రి హ‌రీశ్ రావు
వ‌రంగ‌ల్‌లోని ప్ర‌తిష్ఠాత్మ‌క ఎంజీఎం ఆసుప‌త్రిలో ఎలుక‌లు య‌థేచ్ఛ‌గా తిరుగుతున్న వైనంపై ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఆసుప‌త్రిలో సంచ‌రిస్తున్న ఎలుక‌లు.. ఆసుప‌త్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగి కాలును కొరికేశాయి. ఈ ఘ‌ట‌న‌పై గురువారం నాడు ప‌లు టీవీ ఛానెళ్ల‌లో వార్త‌లు ప్రసారం కావ‌డంతో తెలంగాణ వైద్య‌, ఆరోగ్య శాఖ అప్ర‌మ‌త్త‌మైంది.

ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న వెంట‌నే తెలంగాణ వైద్య‌,ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లోనే అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ఆసుప‌త్రిగా పేరుగాంచిన ఎంజీఎంలో ఎలుక‌లు సంచ‌రిస్తున్నాయంటే.. ఆసుప‌త్రిలో పారిశుద్ధ్యం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థ‌మ‌వుతోంద‌ని ఆయ‌న అధికారుల‌ను మంద‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర ద‌ర్యాప్తున‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.


More Telugu News