సీపీఎస్‌పై చ‌ర్చ‌ల‌కు రండి.. ఉద్యోగ సంఘాల‌కు ఏపీ ప్ర‌భుత్వం ఆహ్వానం

  • సీపీఎస్ ను ర‌ద్దు చేస్తామంటూ పాద‌యాత్ర‌లో హామీ 
  • హామీ మేరకు సీపీఎస్ ర‌ద్దు కోరుతున్న ఉద్యోగులు
  • ఏప్రిల్ 4న సీపీఎస్‌పై చ‌ర్చ‌లకు ఆహ్వానం 
కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీమ్ (సీపీఎస్‌)పై చ‌ర్చ‌ల‌కు రావాలంటూ ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జ‌గ‌న్ స‌ర్కారు ఆహ్వానం పంపింది. ఏప్రిల్ 4న సీపీఎస్‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఏపీ ప్ర‌భుత్వం.. చ‌ర్చ‌లకు హాజ‌రు కావాలంటూ ఉద్యోగ సంఘాల నేత‌ల‌ను గురువారం ఆహ్వానించింది. 

పీఆర్సీ ప్ర‌క‌ట‌న సంద‌ర్భంగా ఉద్యోగుల‌తో జ‌రిగిన చ‌ర్చ‌ల్లో సీపీఎస్ అంశం కూడా ఒక‌టిగా ఉన్న‌ సంగ‌తి తెలిసిందే. తాము అధికారంలోకి వ‌చ్చాక సీపీఎస్ ను ర‌ద్దు చేస్తామంటూ పాద‌యాత్ర‌లో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అనుకున్న‌ట్లుగానే అధికారంలోకి వైసీపీ రాగా..ఇప్ప‌టిదాకా సీపీఎస్ ర‌ద్దు కాలేదంటూ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో దీనిపై చ‌ర్చిద్దామంటూ చెప్పిన ప్ర‌భుత్వం వచ్చే నెల 4న జ‌ర‌గ‌నున్న చ‌ర్చ‌ల‌కు రావాలంటూ ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు ఆహ్వానం పంపింది.


More Telugu News