మంత్రి హ‌త్య‌కు కుట్ర కేసు నిందితుల‌కు బెయిల్‌

  • మంత్రి శ్రీనివాస్ గౌడ్ హ‌త్య‌కు కుట్ర‌
  • నిందితుల మ‌ధ్య విభేదాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ కుట్ర కోణం
  • కుట్ర‌ను ఛేదించిన సైబ‌రాబాద్ పోలీసులు
తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ హ‌త్య‌కు కుట్ర ప‌న్నిన నిందితుల‌కు బెయిల్ ల‌భించింది. ఈ కేసును విచారిస్తున్న మేడ్చ‌ల్ కోర్టు నిందితుల‌కు గురువారం ష‌ర‌తుల‌తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను హ‌త్య చేసేందుకు కొంద‌రు వ్య‌క్తులు కిరాయి హంత‌కుల‌కు సుపారీ ఇచ్చిన‌ట్టుగా వెల్ల‌డైన ప‌థ‌కం తెలంగాణ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే.

ఈ కేసులో నిందితులు బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డికి చెందిన ఢిల్లీ నివాసంలో ఆశ్ర‌యం పొందార‌న్న విష‌యంతో టీఆర్ఎస్‌, బీజేపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. తమలో నెలకొన్న విభేదాల కార‌ణంగా నిందితులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఓ వర్గం తమపై దాడి చేస్తోందని భావించిన రెండో వర్గం తమకు రక్ష కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసు విచారణలో భాగంగా  సైబ‌రాబాద్ పోలీసులు మంత్రి హ‌త్య‌కు జ‌రిగిన కుట్ర‌ను ఛేదించిన విష‌యం తెలిసిందే.


More Telugu News