టీటీడీ సభ్యులుగా నేరచరితులకు అవకాశం ఇచ్చారంటూ పిటిషన్... విచారణ చేపట్టిన హైకోర్టు సీజే ధర్మాసనం
- హైకోర్టులో బీజేపీ నేత భానుప్రకాశ్ పిటిషన్
- పాలకవర్గంలో నేరచరితులు ఉండరాదన్న కోర్టు
- తదుపరి విచారణ ఏప్రిల్ 19కి వాయిదా
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో నేరచరితులను సభ్యులుగా నియమించారంటూ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. కేసుకు సంబంధించిన వివరాలను పిటిషనర్ తరఫు న్యాయవాది సీజే ధర్మాసనానికి వివరించారు.
నేరచరిత్ర ఉన్నవారిని టీటీడీ బోర్డు సభ్యులుగా ఎలా నియమిస్తారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకేదో లబ్ది జరగడం వల్లే ఇలా చేస్తున్నట్టుంది అని కోర్టు వ్యాఖ్యానించినట్టు సమాచారం. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నట్టు భావిస్తున్నామని పేర్కొంది. నేరచరిత్ర ఉన్న సభ్యులు పాలకవర్గంలో ఉండరాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఏప్రిల్ 19న ఈ కేసులో పూర్తి వాదనలు వింటామని, అదే రోజున నిర్ణయం ఉంటుందని వెల్లడించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి మినహాయింపులు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం కేసు విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది.