ఏపీలో భూ సర్వే కోసం అధునాతన డ్రోన్లు... పరిశీలించిన సీఎం జగన్
- జగనన్న భూ హక్కు-భూ రక్ష పథకంపై సమీక్ష
- ఆధునిక డ్రోన్ ను తీసుకువచ్చిన అధికారులు
- సర్వే వేగవంతానికి మరిన్ని డ్రోన్లు
- అధికారులకు దిశా నిర్దేశం చేసిన సీఎం
జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకంపై సీఎం జగన్ నేడు సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే కోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన డ్రోన్ ను అధికారులు ఈ సందర్భంగా సీఎం ముందుకు తీసుకువచ్చారు. ఆ డ్రోన్ ను సీఎం జగన్ ఆసక్తిగా పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
భూ సర్వే కోసం 41 అత్యాధునిక డ్రోన్లు ఉపయోగిస్తున్నామని, త్వరితగతిన పూర్తి చేసేందుకు మరో 20 డ్రోన్లను కూడా రంగంలోకి దించనున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ భూ హక్కు-భూ రక్ష పథకానికి సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
.
భూ సర్వే కోసం 41 అత్యాధునిక డ్రోన్లు ఉపయోగిస్తున్నామని, త్వరితగతిన పూర్తి చేసేందుకు మరో 20 డ్రోన్లను కూడా రంగంలోకి దించనున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ భూ హక్కు-భూ రక్ష పథకానికి సంబంధించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
- వెబ్ ల్యాండ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి.
- ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే కాకుండా భౌతిక రికార్డులను కూడా రూపొందించాలి.
- ఈ భౌతిక రికార్డులను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తుండాలి. రికార్డులు ఎవరూ తారుమారు చేయలేని విధంగా ఉండాలి.
- సబ్ డివిజన్ కోసం దరఖాస్తు వచ్చిన వెంటనే సర్వే జరిగేలా ఉండాలి.
- అంతిమంగా సచివాలయాల స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగాలి.
- రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. ఇందులో న్యాయశాఖను కూడా భాగస్వామిగా చేయాలి. భూ యజమానులకు క్లియర్ టైటిల్స్ ఇచ్చేనాటికి, ఆయా భూములపై వివాదాలు లేకుండా చూడాలి.
- ఏపీలో చేపట్టే భూ సర్వే, రికార్డుల నిర్వహణ దేశానికి దిక్సూచిలా నిలవాలి.
- ఎక్కడైనా లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవు.