శ్రీశైలంలో దుకాణాలకు నిప్పుపెట్టిన కన్నడ భక్తులు.. అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత

  • టీ దుకాణం వద్ద స్థానిక, కన్నడ భక్తుల మధ్య ఉద్రిక్తత
  • కర్ణాటక యువకుడిపై గొడ్డలితో స్థానికుల దాడి
  • తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలింపు
  • బలగాలను మోహరించిన పోలీసులు  
శ్రీశైల పుణ్యక్షేత్రంలో గత అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శ్రీశైల పురవీధుల్లో కన్నడ యువకులు వీరంగమేశారు. ఓ సత్రం ముందు ఉన్న టీ దుకాణం వద్ద కర్ణాటక, స్థానిక భక్తుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఇది మరింత పెరిగి తాత్కాలిక దుకాణాలు, కార్లు, ద్విచక్ర వాహనాలపై దాడికి కారణమైంది. ఆ తర్వాత ఆగ్రహంతో ఊగిపోయిన కన్నడ భక్తులు టీ దుకాణానికి నిప్పు పెట్టారు. దీంతో కర్ణాటక భక్తుడిపై స్థానికులు గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. అతడు తీవ్రంగా గాయపడడంతో వెంటనే సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

దాడితో ఆగ్రహం వ్యక్తం చేసిన కన్నడ భక్తులు స్థానిక దుకాణాలకు నిప్పు పెట్టారు. ఫలితంగా ఆలయ పరిసరాల్లోని దుకాణాలతో పాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. పాతాళగంగ, నంది సర్కిల్, పరిపాలన భవనం ముందు లైన్లతో పాటు, తాత్కాలిక షాపులను ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.


More Telugu News