తెలంగాణలో భానుడి భగభగ.. 11.30 గంటల వరకే స్కూళ్లు
- తెలంగాణలో మండుతున్న ఎండలు
- పాఠశాలల పనివేళలను కుదిస్తూ నిర్ణయం
- 8 గంటల నుంచి 11.30 గంటల వరకే పాఠశాలలు
- ఏప్రిల్ 6 దాకా అమలు చేయాలన్న విద్యాశాఖ
తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రత్యేకించి తెలంగాణలో చాలా వేగంగానే ఎండ వేడిమి పెరుగుతోంది. ఎండ తీవ్రత పెరుగుతున్న వైనంపై దృష్టి సారించిన తెలంగాణ సర్కారు.. పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది.
తెలంగాణలో పాఠశాలల పనివేళలను కుదిస్తూ ప్రభుత్వం బుధవారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం గురువారం నుంచి పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకే నడవనున్నాయి. ఈ మేరకు అధికారులతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎస్ సోమేశ్ కుమార్ పాఠశాలల పనివేళలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ పనివేళలను ఏప్రిల్ 6 దాకా అమలు చేయాలని విద్యా శాఖ ఆయా పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.