కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన బెంగళూరు
- బెంగళూరు,కోల్‌కతాల మధ్య మ్యాచ్
- టాస్ గెలిచిన బెంగళూరు
- ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్స్ జట్టు
క్రికెట్ అభిమానులను వెర్రెత్తిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్‌లో భాగంగా బుధవారం నాడు కోల్‌కతా నైట్ రైడర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి టాస్ గెలిచిన బెంగళూరు జట్టు కోల్‌కతాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడెమీలో జరగనుంది.