చిరూ .. చరణ్ చేసే పోరాటం ఒక రేంజ్ లో ఉంటుందట!
- కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య'
- ప్రధాన పాత్రల్లో చిరూ - చరణ్
- సంగీత దర్శకుడిగా మణిశర్మ
- ఏప్రిల్ 29వ తేదీన విడుదల
'రాధేశ్యామ్' థియేటర్లకు వచ్చేసింది .. 'ఆర్ ఆర్ ఆర్' కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి 'ఆచార్య' పైనే ఉంది. చిరంజీవి - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి కొరటాల దర్శకత్వం వహించాడు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ సినిమాలో ముందుగా చరణ్ తో చిన్న పాత్ర చేయిద్దామని అనుకున్నారు. కానీ ఆయన పాత్ర డిమాండ్ చేయడం వలన పెంచుతూ వెళ్లారు. అలా ఒక రకంగా ఈ సినిమా మల్టీ స్టారర్ గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో చిరూ - చరణ్ కలిసి తెరపై ఎంతసేపు కనిపిస్తారనేది ఆసక్తికరమైన అంశంగా మారింది.
ఈ సినిమాలో చిరూ .. చరణ్ సెపరేటు సీన్స్ ఎలాగూ ఉంటాయి. ఇక ఇద్దరూ కలిసి తెరపై 20 నుంచి 25 నిమిషాల వరకూ కనిపిస్తారట. ఈ ఇద్దరూ కలిసి చేసే పోరాటం ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. సినిమా మొత్తం ఒక ఎత్తనీ .. ఈ ఒక్క సీన్ ఒక ఎత్తని చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.