రేవంత్‌రెడ్డికి ఏమైనా జరిగితే మా బాధ్యత కాదు: బాల్క సుమన్
- ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు
- చిప్పకూడు తినేందుకు రెడీగా ఉండాలి
- ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలన్న సుమన్
టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ యువ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి ఏమైనా జరిగితే మా బాధ్యత కాదంటూ సుమన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
తెలంగాణలో ఈ యాసంగిలో పండే ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇందులోకి తాజాగా మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మంగళవారం మొత్తం ట్వీట్ల వార్ నడిచిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో బుధవారం మీడియా ముందుకు వచ్చిన బాల్క సుమన్ కాంగ్రెస్ పార్టీ తీరుపై.. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్న సుమన్.. చిప్పకూడు తినేందుకు రెడీగా ఉండాలంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగానే ఆయన రేవంత్ రెడ్డికి ఏమైనా జరిగితే మా బాధ్యత కాదంటూ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రాన్ని ప్రశ్నించాలని ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలకు సూచించారు.