ఢిల్లీలో టీపీసీసీ నేతలు.. రాహుల్‌తో మొదలైన భేటీ
- రేవంత్ సహా 14 మందికి రాహుల్ అపాయింట్ మెంట్
- టీపీసీసీలో వరుస విభేదాలపైనే కీలక చర్చ
- తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించే అవకాశం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందిన కీలక నేతలంతా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా 14 మంది ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లారు. వీరితో కాసేపటి క్రితం పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. ఈ భేటీలో టీపీసీసీలో వరుసగా చోటుచేసుకుంటున్న విభేదాలపై ప్రత్యేకంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.
పార్టీలో విభేదాలతో పాటుగా తెలంగాణ అసెంబ్లీకి త్వరలో జరిగే ఎన్నికలకు సంబందించి పార్టీ వ్యూహంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. టీపీసీసీలో విభేదాల నేపథ్యంలో ఎవరికి వారే పార్టీ అధిష్ఠానం అపాయింట్మెంట్లు అడుగుతున్న నేపథ్యంలో స్వయంగా రాహుల్ గాంధీనే ఈ భేటీకి ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. రేవంత్ సహా 14 మంది టీపీసీసీ నేతలకు ఆయన ఆపాయింట్ మెంట్ ఇవ్వగా... వారంతా ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని కాసేపటి క్రితం రాహుల్‌తో మొదలైన భేటీకి హాజరయ్యారు.