ఘనంగా బొండా ఉమ కొడుకు, ఏవీ సుబ్బారెడ్డి కుమార్తెల నిశ్చితార్థం!
- వియ్యంకులు కాబోతున్న బొండా ఉమ, ఏవీ సుబ్బారెడ్డి
- అమెరికాలో చిగురించిన సిద్ధార్థ్, జశ్వంతిల ప్రేమ
- యువ జంటపై వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ, ఆళ్లగడ్డ టీడీపీ కీలక నేత ఏవీ సుబ్బారెడ్డిలు వియ్యంకులు కాబోతున్నారు. బొండా ఉమ కొడుకు సిద్ధార్థ్, సుబ్బారెడ్డి కుమార్తె జశ్వంతి రెడ్డిల నిశ్చితార్థం ఈ నెల 27న జరిగింది. వీరి ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్నేళ్లుగా సిద్ధార్థ్, జశ్వంతి అమెరికాలో ఉంటున్నారు. వీరి స్నేహం చివరకు ప్రేమకు దారితీసింది. ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి. యువ జంటకు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.