మిర్చికి రికార్డు ధ‌ర‌... ఎనుమాముల‌లో ఆల్ టైం హై రేటు

  • గ‌త వారం రూ.45 వేలు ప‌లికిన ధ‌ర
  • తాజాగా రూ.52వేల‌కు చేరిన మిర్చి ధ‌ర‌
  • హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న అన్న‌దాత‌లు
మిర్చి ధ‌ర అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఎర్ర బంగారంగా పిలిచే మిర్చికి ఎప్పుడూ పెద్ద‌గా మ‌ద్ద‌తు ధ‌ర ద‌క్కిన దాఖ‌లా లేదు. అయితే ఇటీవ‌లి కాలంలో మిర్చి రైతుల‌కు మంచి ధ‌ర‌లు ద‌క్కుతున్నాయి. ఈ క్ర‌మంలో వ‌రంగల్ ప‌రిధిలోని ఎనుమాముల మార్కెట్‌లో దేశ‌వాళీ మిర్చికి రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ.52 వేల ధ‌ర ద‌క్కింది. 

గ‌త వారంలో ఇదే మార్కెట్‌లో దేశవాళీ మిర్చికి రూ.42వేల నుంచి రూ.45 వేల ధ‌ర ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ఈ ధ‌ర‌లే రికార్డు స్థాయి ధ‌ర‌లంటూ ప్ర‌చారం సాగ‌గా.. ఆ ధ‌ర‌ల‌ను దాటేసి క్వింటాల్ మిర్చి ఏకంగా రూ.52 వేలు ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం. ఈ ధ‌ర మిర్చికి సంబంధించి ఈ మార్కెట్‌లో ఆల్ టైం హై రేటేన‌ని అధికారులు చెబుతున్నారు.  మిర్చికి అంత‌కంత‌కూ రేటు పెరుగుతున్న వైనంపై అన్న‌దాత‌లు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News