ఏప్రిల్ 4న‌ ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభం.. ముహూర్తం ఖ‌రారు

  • 4న ఉద‌యం 9.05 నుంచి 9.45 గంట‌ల మ‌ధ్య ముహూర్తం
  • కొత్త జిల్లాల‌ను లాంఛ‌నంగా ప్రారంభించనున్న జ‌గ‌న్‌
  • ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కే కొత్త జిల్లాల ఏర్పాటు
  • కొత్త జిల్లాల‌తో ఏపీలో ఇక‌పై మొత్తం జిల్లాల సంఖ్య 26
ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభానికి ముహూర్తం ఖ‌రారైంది. ఏప్రిల్ 4న ఉద‌యం 9.05 గంట‌ల నుంచి 9.45 గంట‌ల మ‌ధ్య‌లో కొత్త‌గా ఏర్పాటు కానున్న అన్ని జిల్లాల క‌లెక్ట‌రేట్ల‌ను ప్రారంభించాల‌ని జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యించింది. ఈ మేర‌కు మంత్రులు, ఉన్న‌తాధికారుల‌తో భేటీ అయిన సీఎం జ‌గ‌న్ కొత్త జిల్లాలు ప్రారంభించ‌డానికి ముహూర్తాన్ని ఖ‌రారు చేశారు. ఈ ముహూర్తానికే సీఎం జ‌గ‌న్ కొత్త జిల్లాల‌ను ప్రారంభిస్తారు.

ఏపీలో కొత్త‌గా అందుబాటులోకి రానున్న జిల్లాల‌తో క‌లిపి మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరుకోనుంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 13 జిల్లాల‌తో కొత్త ప్ర‌స్థానం ప్రారంభించిన ఏపీ.. ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యంతో 26 జిల్లాల‌తో సాగ‌నుంది. ప్ర‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఓ జిల్లాగా మారుస్తానంటూ 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలోనే జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  


More Telugu News