ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యుత్ చార్జీల పెరుగుద‌ల‌

  • 30 యూనిట్ల వ‌ర‌కు 45 పైస‌ల పెంపు
  • 31 నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు
  • 76 నుంచి 125 యూనిట్ల వరకు రూ.1.40 
  • 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.1.57 పెరుగుద‌ల‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యుత్‌ ఛార్జీలు పెంచాల‌ని విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) నిర్ణయం తీసుకుంది. పెంచిన విద్యుత్‌ ఛార్జీలు ఆగస్ట్‌ నుంచి అమల్లోకి వ‌స్తాయి. ఈఆర్‌సీ ప్ర‌క‌టించిన వివ‌రాల ప్ర‌కారం.. 30 యూనిట్ల వరకు 45 పైసలు, 31 నుంచి 75 యూనిట్ల వరకు 91 పైసలు, 76 నుంచి 125 యూనిట్ల వరకు రూ.1.40 పెంచారు. 

అలాగే, 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.1.57 పెంచ‌గా, 226 నుంచి 400 యూనిట్ల వరకు రూ.1.16 పెంచారు. 400 యూనిట్లు దాటితే యూనిట్‌కు 55 పైసలు పెంచుతున్నారు. ఇప్ప‌టికే తెలంగాణ‌లోనూ విద్యుత్ చార్జీలు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌ట‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఏప్రిల్ నుంచే తెలంగాణ‌లో విద్యుత్ చార్జీల పెరుగుద‌ల అమ‌ల్లోకి రానుంది.

పూర్తి వివ‌రాలు ఇవిగో...

               


More Telugu News