సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ప్రారంభం
- కొత్త జిల్లాల ఏర్పాటే ప్రధాన అంశంగా సమావేశం
- పాల్గొన్న ఉన్నతాధికారులు, మంత్రులు
- కీలక నిర్ణయాలు తీసుకోనున్న ముఖ్యమంత్రి
- ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన
ఏపీ సీఎం జగన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలువురు మంత్రులతో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటే ప్రధాన అంశంగా ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై సాయంత్రంలోపు స్పష్టత రానుంది. కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై జగన్ సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, ఒక నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలను వేర్వేరు జిల్లాల్లోకి మార్చడంపైనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై విస్తృతంగా చర్చిస్తున్నారు. ఉగాదికి ఒక్క రోజు ముందు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఆరు నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది.
అలాగే, బాపట్ల కేంద్రంగానూ ఓ జిల్లా ఏర్పాట్లు కానుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కేంద్రంగా ఏర్పడనున్న మన్యం జిల్లాకు ఇప్పటికే సర్కారు కార్యాలయాల కోసం భవనాలు గుర్తించి మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నారు.
మరోవైపు, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాలతో ఉయ్యూరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉంది. ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరగాల్సి ఉంది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల విషయంలో కొన్ని మార్పులపై తుది నిర్ణయం తీసుకుని ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.