'మాచర్ల నియోజకవర్గం' రిలీజ్ డేట్ ఖరారు!

  • నితిన్ హీరోగా 'మాచర్ల నియోజక వర్గం'
  • రాజకీయాల నేపథ్యంలో సాగే కథ 
  • నెక్స్ట్ మూవీ వక్కంతం వంశీతో 
  • లైన్లో  సురేందర్ రెడ్డి ప్రాజక్టు 
నితిన్ కథానాయకుడిగా 'మాచర్ల నియోజక వర్గం' సినిమా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి నితిన్ ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ఈ రోజున నితిన్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జులై 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా అధికారిక పోస్టర్ ను వదిలారు. 

నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. నితిన్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న ఈ సినిమాలో, ఒక కథానాయికగా కృతి శెట్టి .. మరో కథానాయికగా కేథరిన్ అలరించనున్నారు. గ్రామీణ రాజకీయాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. యాక్షన్ తో పాటు ఎమోషన్ పుష్కలంగా ఉన్న కథ ఇది. 

కొంతకాలంగా నితిన్ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి. ఈ సినిమా తరువాత ఆయన వక్కంతం వంశీ దర్శకత్వంలో 'జూనియర్' చేయనున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల పేరు వినిపిస్తోంది. ఆ తరువాత  ప్రాజెక్టు సురేందర్ రెడ్డితో ఉండనుందని అంటున్నారు.


More Telugu News