5 రోజుల్లో 100 కోట్లను కొల్లగొట్టేసిన హిందీ 'ఆర్ ఆర్ ఆర్'

  • ఈ నెల 25న విడుదలైన 'ఆర్ ఆర్ ఆర్'
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు 
  • దేశవ్యాప్తంగా అదే జోరు
  • కొత్త రికార్డుల నమోదు  
భారీ అంచనాల మధ్య ఈ నెల 25వ తేదీన 'ఆర్ ఆర్ ఆర్' విడుదలైంది. విడుదల వరకూ కూడా చాలామందికి కథ విషయంలో క్లారిటీ లేదు. చరిత్రకు కల్పన జోడించడం వలన, ఆ తరువాత ఏం జరగబోతుందనేది ఎవరూ గెస్ చేయలేకపోయారు. భారీతనమనేది ఈ సినిమాకి ప్రధానమైన బలంగాను .. ఆకర్షణగాను నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు .. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా వసూళ్ల  వర్షాన్ని కురిపిస్తోంది. తొలి రోజునే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా, హిందీలో  5 రోజులకు గాను 107 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. లాంగ్ రన్ లో ఒక్క హిందీలోనే ఈ సినిమా 200 కోట్లను వసూలు చేయవచ్చని అంటున్నారు. 

 ఎన్టీఆర్ .. చరణ్ పాత్రల తరువాత అజయ్ దేవగణ్ ..  రే స్టీవెన్సన్ పాత్రలు బలమైనవిగా కనిపిస్తాయి. మిగతా పాత్రలన్నీ నామమాత్రంగానే అనిపిస్తాయి. సంగీతం .. ఫొటోగ్రఫీ .. కాస్ట్యూమ్స్ డిజైన్ .. ఆర్ట్ వర్క్ ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయని చెప్పాలి. వసూళ్ల పరంగా ఈ సినిమా జోరు అదే రేంజ్ లో కొనసాగుతుండటం విశేషం.


More Telugu News