తెలంగాణలో నిన్న భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్.. రికార్డు స్థాయిలో 14,160 మెగావాట్ల విద్యుత్ వినియోగం

  • మండిపోతున్న ఎండలు 
  • పెరుగుతున్న విద్యుత్ వినియోగం
  • మరో మూడు రోజులపాటు ఇలాగే ఉంటుందన్న విద్యుత్ శాఖ
  • 18 వేల మెగావాట్ల డిమాండ్ వరకు ఎలాంటి ఇబ్బంది లేదన్న అధికారులు
ఎండలు ముదురుతుండడంతో తెలంగాణలో విద్యుత్ వినియోగం ఒక్కసారిగా ఊపందుకుంది. భానుడి ప్రతాపం నుంచి తప్పించుకునేందుకు ప్రజలు విద్యుత్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా నిన్న మధ్యాహ్నం రికార్డు స్థాయిలో 14,160 మెగావాట్ల విద్యుత్ వినియోగమైనట్టు విద్యుత్ శాఖ తెలిపింది. మరో నాలుగైదు రోజుల వరకు వినియోగం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. 

అయితే, విద్యుత్ కోతల భయం అక్కర్లేదని, 18 వేల మెగావాట్ల డిమాండ్‌ వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని భరోసా ఇచ్చింది. పెరుగుతున్న వినియోగానికి అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ట్రాన్స్ కో-జెన్ కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్‌ను రూ. 20 చొప్పున కొనుగోలు చేస్తున్నామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభాకర్‌రావు తెలిపారు.


More Telugu News