పురుషులతో సమానంగా మహిళా వరల్డ్ కప్ ప్రైజ్ మనీ... పరిశీలిస్తున్న ఐసీసీ

  • పురుష, మహిళా వరల్డ్ కప్ ప్రైజ్ మనీలో భారీ వ్యత్యాసం
  • 2019 పురుష వరల్డ్ కప్ విజేతకు రూ.28 కోట్లు
  • ఈ ఏడాది మహిళల వరల్డ్ కప్ విజేతకు రూ.10 కోట్లు
  • దీనిపై చర్చిస్తామన్న ఐసీసీ సీఈవో
పరుషుల క్రికెట్లో వరల్డ్ కప్ ఈవెంట్లకు భారీ ప్రైజ్ మనీ అందిస్తారు. 2019లో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లో విజేతకు 4 మిలియన్ డాలర్లు (అప్పటి రూపాయితో డాలర్ మారకం విలువ ప్రకారం రూ.28 కోట్లు) అందించారు. కానీ మహిళల క్రికెట్ కు ప్రైజ్ మనీ చాలా తక్కువ అని తెలిసిందే. ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరుగుతున్న మహిళల వరల్డ్ కప్ విజేతకు ఇవ్వబోయేది 1.32 మిలియన్ డాలర్లు (రూ.10 కోట్లు) మాత్రమే. 

ఈ భారీ వ్యత్యాసంపై విమర్శలు వస్తుండడం పట్ల ఐసీసీ స్పందించింది. పురుషులతో సమానంగా మహిళల వరల్డ్ కప్ ప్రైజ్ మనీ అందించడంపై మరింత విస్తృతంగా చర్చించాలని నిర్ణయించింది. వచ్చే 8 ఏళ్లకు సంబంధించిన ఐసీసీ మహిళా ఈవెంట్లలో అందించాల్సిన ప్రైజ్ మనీపై తప్పకుండా చర్చిస్తామని ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డైస్ వెల్లడించారు.


More Telugu News