ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలి.. లోక్ సభలో గల్లా జయదేవ్ డిమాండ్
- లోక్ సభలో ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చిన జయదేవ్
- భారతరత్న ఇవ్వాలంటూ చాలా కాలం నుంచి టీడీపీ డిమాండ్
- టీడీపీ 40 వసంతాల పండుగనూ ప్రస్తావించిన ఎంపీ
తెలుగు ప్రజల ఆత్మ గౌరవం నినాదంతో తెలుగు దేశం పార్టీ పేరిట ఓ రాజకీయ పార్టీని ప్రారంభించి జాతీయ రాజకీయాల్లో సైతం సత్తా చాటిన నేతగా దివంగత ఎన్టీఆర్‌కు ఓ ట్రాక్ రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ ప్రారంభించిన అతి తక్కువ కాలంలోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన అరుదైన రికార్డు కూడా ఎన్టీఆర్ సొంతమే. ఎన్టీఆర్ చేతుల్లో పురుడు పోసుకున్న టీడీపీకి నేటితో 40 ఏళ్లు నిండాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ ఎంపీ గల్లా జయదేవ్.. పార్లమెంటులో టీడీపీ పేరుతో పాటు ఎన్టీఆర్ పేరును కూడా ప్రస్తావించారు.
రాజకీయాల్లో సత్తా చాటిన ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలని చాలా కాలం నుంచి టీడీపీ డిమాండ్ చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. టీడీపీ 40 వసంతాల వేళ కూడా ఆ పార్టీ ఎంపీగా గల్లా జయదేవ్ అదే డిమాండ్‌ను మరోమారు ప్రస్తావించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించిన గల్లా జయదేవ్.. ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అదే సమయంలో టీడీపీ 40 వసంతాల పండుగ జరుపుకుంటున్న విషయాన్ని ఆయన పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లారు.