ఈ టీడీపీ కీల‌క నేత‌కు నేడు రెండు పండుగ‌లు

  • వేడుక‌గా టీడీపీ 40 వ‌సంతాల పండుగ
  • టీడీపీ ఆవిర్భావం నాడే దేవినేని జ‌న‌నం
  • మాజీ మంత్రికి బ‌ర్త్ డే విషెస్ చెప్పిన నారా రోహిత్‌
తెలుగు దేశం పార్టీ (టీడీపీ)కి చెందిన కీల‌క నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుకు మంగ‌ళ‌వారం నాడు (మార్చి29) నిజంగానే రెండు పండుగ‌లు జ‌రుపుకునే మ‌హ‌దావ‌కాశం చిక్కింది. ఎందుకంటే.. తాను ఉంటున్న‌ పార్టీ ప్ర‌స్థానం మొద‌లెట్టిన రోజే.. తాను కూడా జ‌న్మించారు కాబ‌ట్టి. 1982 మార్చి 29న టీడీపీ ఆవిర్భ‌విస్తే.. 1962లో స‌రిగ్గా మార్చి 29న‌ దేవినేని జ‌న్మించారు. ఇలా ఒకే రోజు ఇలాంటి రెండు పండుగ‌లు జ‌రుపుకునే నేత‌లు చాలా త‌క్కువ మందే ఉంటారు.

టీడీపీ 40 ఏళ్ల ప్ర‌స్థానాన్ని పుర‌స్క‌రించుకుని తెలుగు నేల వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టాయి. విదేశాల్లో ఉంటున్న తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు సైతం తమతమ ప్రాంతాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుక‌ల‌ను హోరెత్తిస్తున్నారు. ఇక ఏపీ పొలిటిక‌ల్ కేపిట‌ల్ విజ‌య‌వాడ‌లో వేడుక‌లు ఓ రేంజిలో సాగుతున్నాయి. దేవినేని కూడా ఉత్సాహంగా కార్యక్ర‌మాల్లో పాలుపంచుకుంటున్నారు. ఇలాంటి సంద‌ర్భంలో ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ చంద్ర‌బాబు సోద‌రుడు రామ్మూర్తినాయుడు కుమారుడు, టాలీవుడ్ హీరో నారా రోహిత్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు.


More Telugu News