దక్షిణాది సినిమాలపై రాశీఖన్నా విమర్శలు

  • ఇంతకాలం దక్షిణాది రొటీన్ ఫార్ములాకు అలవాటు పడ్డాను
  • హీరో పక్కన కాసేపు కనిపించడం, ఆ తర్వాత వెళ్లిపోవడం దక్షిణాదిలో రొటీన్
  • ఇకపై కథల ఎంపికలో కొత్తదనం ఉంటుందన్న రాశి 
టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించినప్పటికీ స్టార్ డమ్ రానటువంటి హీరోయిన్లలో రాశీఖన్నా ఒకరు. దాదాపు అందరు హీరోలతో నటించినప్పటికీ పెద్దగా అదృష్టం కలిసిరాలేదు. ఈ నేపథ్యంలో తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినా, అక్కడ కూడా పెద్దగా ప్రయోజనం కలగలేదు. దీంతో, ఇప్పుడు బాలీవుడ్ వైపు చూస్తోంది. తాజాగా అజయ్ దేవగణ్ తో కలిసి 'రుద్ర' అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ కు మంచి టాక్ వచ్చింది. అంతేకాదు రాశీకి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చింది. దీంతో హిందీలో ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. 

అయితే, హిందీలో అవకాశాలు వస్తుండటంతో... ఇంతవరకు ఆదుకున్న దక్షిణాది పరిశ్రమపై సంచలన కామెంట్లు చేస్తోంది. సౌత్ సినిమాలు చేస్తున్నంత కాలం రొటీన్ ఫార్ములాకు అలవాటు పడ్డానని చెప్పింది. తనకు రొటీన్ పాత్రలు చేయడం ఇష్టం ఉండదని... హీరోల పక్కన కాసేపు కనిపించడం, ఆ తర్వాత పక్కకు వెళ్లిపోవడం దక్షిణాదిలో రొటీన్ అని తెలిపింది. టాలీవుడ్ ఈ ఫార్ములాను సృష్టించిందని, తాను కూడా అందులో పడిపోయానని చెప్పింది. ఇకపై తన కథల ఎంపికలో కొత్తదనం ఉంటుందని తెలిపింది. ప్రతి సినిమాలో తనను కొత్తగా చూస్తారని చెప్పింది.


More Telugu News