టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఈడీ అడిగిన వివ‌రాలన్నిటినీ ఇచ్చిన‌ట్లు హైకోర్టుకు తెలిపిన‌ ఎక్సైజ్ శాఖ

  • కొన్ని రోజుల క్రితం ఎక్సైజ్ శాఖ‌పై ఈడీ కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్
  • డిజిట‌ల్ రికార్డుల‌తో పాటు కాల్ డేటా ఇవ్వ‌లేద‌ని అభ్యంత‌రం
  • హైకోర్టులో ఎక్సైజ్ శాఖ‌ మెమో దాఖ‌లు
టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు అడిగిన వివ‌రాలు అన్నింటినీ తాము ఇచ్చిన‌ట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ మేర‌కు ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో ఎక్సైజ్ శాఖ‌ మెమో దాఖ‌లు చేసింది. కొన్ని రోజుల క్రితం ఎక్సైజ్ శాఖ‌పై ఈడీ కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్ దాఖ‌లు చేసి, ఆ శాఖ త‌మ‌కు డిజిట‌ల్ రికార్డుల‌తో పాటు కాల్ డేటా ఇవ్వ‌లేద‌ని తెలిపింది. 

టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో విచార‌ణ‌కు త‌మ‌కు ఎక్సైజ్ శాఖ స‌హ‌క‌రించ‌ట్లేద‌ని చెప్పింది. దీంతో ఈడీ కోరిన వివ‌రాలు అందించి, ఈ కేసులో స‌హ‌కరించాల‌ని ఎక్సైజ్ శాఖ‌ను కోర్టు ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో ఈడీ అడిగిన వివ‌రాలు ఇచ్చామ‌ని ఈ రోజు హైకోర్టుకు ఎక్సైజ్ శాఖ తెలిపింది.


More Telugu News