ఇన్స్టాగ్రామ్ లో ఒక్కో పోస్టుకు సమంత ఎంత వసూలు చేస్తుందో తెలుసా?

  • నాగచైతన్యతో విడిపోయిన తర్వాత కెరీర్ పై పూర్తి దృష్టి సారించిన సమంత
  • సినిమాలు, ఓటీటీలతో బిజీగా ఉన్న శామ్
  • ఒక్కో ఇన్స్టా పోస్ట్ కు రూ. 25 లక్షలు వసూలు చేస్తున్న వైనం
అక్కినేని నాగచైతన్యతో వైవాహిక బంధానికి ముగింపు పలికిన తర్వాత సమంత తన పూర్తి దృష్టిని కెరీర్ పైనే పెట్టింది. ప్రస్తుతం సినిమాలే కాకుండా పలు ఓటీటీ ప్రాజెక్టులు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. బాలీవుడ్ కు దగ్గరవడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతోంది.

 మరోవైపు సోషల్ మీడియాలో సమంత చాలా యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఆమెకు లక్షల సంఖ్యలో ఫాలోయర్లు ఉన్నారు. జనాల్లో చైతన్యం తీసుకొచ్చే విధంగా కూడా ఆమె పోస్టులు ఉంటుంటాయి.

ఇదిలావుంచితే, సమంతకు సంబంధించి ప్రస్తుతం ఒక వార్త వైరల్ అవుతోంది. ఇన్స్టాగ్రామ్ లో ఆమె చేసే ప్రతి పోస్టుకు రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు చార్జ్ చేస్తుందనేదే ఆ వార్త సారాంశం. ఇంతకు ముందు ఒక్కో పోస్టుకు రూ. 8 లక్షలు తీసుకునే సమంత... ఇటీవల భారీగా పెంచేసిందని అంటున్నారు.


More Telugu News