ఆస్కార్ వేడుకలో యాంకర్‌ను కొట్టిన సినీనటుడు విల్ స్మిత్‌కు కంగనా రనౌత్ మద్దతు
- యాంకర్ అలాంటి వ్యాఖ్యలు చేస్తే గట్టిగా బదులిస్తా
- మా అమ్మ లేక సోదరికి ఉన్న వ్యాధిని అవహేళన చేస్తూ మాట్లాడితే అలాగే చేస్తా
- జోక్ వేయడానికి అలాంటి వ్యాఖ్యలు చేయడమేంటన్న కంగనా
ఆస్కార్ అవార్డుల వేడుకలో కింగ్ రిచర్డ్ సినిమాకి విల్ స్మిత్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో యాంకర్ క్రిస్ రాక్ మాట్లాడిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విల్ స్మిత్ అతని చెంప పగలగొట్టిన వివాదంపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్పందించింది. విల్ స్మిత్ భార్యపై జోక్ వేసిన యాంకర్ క్రిస్ రాక్‌పై మండిపడింది. విల్స్మిత్కి మద్దతు తెలిపింది.
జోక్ వేయడానికి ఎవడైనా ఇడియట్ తన అమ్మ లేక సోదరికి ఉన్న వ్యాధిని అవహేళన చేస్తూ మాట్లాడితే తాను కూడా విల్ స్మిత్‌లాగే చేస్తానని చెప్పింది. తాను కూడా గట్టిగా బదులిస్తానని పేర్కొంది. ఆ యాంకర్ త్వరలోనే తన లాకప్ షోకి కంటెస్టెంట్‌గా వస్తాడని ఆశిస్తున్నానని చెప్పింది. నవ్వుతోన్న ఎమోజీని ఆమె ఈ సందర్భంగా జోడించింది.