నేటి నుంచి నాలుగు రోజులపాటు సమతామూర్తి దర్శనాలకు సెలవు

  • ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహం ఏర్పాటు 
  • దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు
  • ఏప్రిల్ 1వ తేదీ వరకు భక్తులకు అనుమతి నిరాకరణ
శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన సమతామూర్తి దర్శనానికి నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించారు. శ్రీరామనగర్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు భక్తులకు అనుమతి ఉండదని నిర్వాహకులు తెలిపారు. అయితే, అందుకు గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఏప్రిల్ 2వ తేదీ నుంచి తిరిగి భక్తులను అనుమతిస్తామని తెలిపారు. ఇటీవల ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించిన ఈ బంగారు విగ్రహాన్ని సందర్శించేందుకు భక్తులు పోటెత్తుతుండడంతో ముచ్చింతల్‌ నిత్యం భక్తులతో కళకళలాడుతోంది.


More Telugu News