చంద్రబాబుపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటు వ్యాఖ్యలు
- ఓటుకు నోటు కేసును ప్రస్తావించిన వైసీపీ ఎంపీ
- గత ఎన్నికల్లో టీడీపీకి చావు తప్పి కన్ను లొట్టబోయిందని వ్యాఖ్య
- ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీలు కలిసి రావట్లేదని ఆరోపణ
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై వైసీపీ నేత, అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న గోరంట్ల సోమవారం సహచర ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, మార్గాని భరత్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీపైనా, చంద్రబాబుపైనా ఆయన విమర్శలు గుప్పించారు.
గత ఎన్నికలో టీడీపీకి చావు తప్పి కన్ను లొట్ట పోయిందన్న మాధవ్.. ముగ్గురు టీడీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టారని ధ్వజమెత్తారు. చచ్చిన పార్టీని బతికించుకోవడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీలను తమతో కలిసి రమ్మంటే రాలేదని ఆయన ఆరోపించారు.
ఓటుకు నోటు కేసులో చిక్కుకున్న చంద్రబాబు హైదరాబాద్ నుంచి పరారై విజయవాడకు వెళ్లిపోయారన్నారు. 'బీసీలు జడ్జీలుగా పనికిరారని చెప్పిన నీచుడు చంద్రబాబు' అంటూ గోరంట్ల మాధవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.