దివ్యాంగులు, వృద్ధులకు టీటీడీ శుభవార్త

దివ్యాంగులు, వృద్ధులకు టీటీడీ శుభవార్త
  • తగ్గిన కరోనా వ్యాప్తి
  • తిరుమల కొండపై సాధారణ పరిస్థితులు
  • దర్శనాల పునరుద్ధరణ
  • ఏప్రిల్ 1 నుంచి వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శనాలు
కరోనా వ్యాప్తి సద్దుమణగడంతో టీటీడీ వివిధ రకాల దర్శనాలు క్రమంగా పునరుద్ధరిస్తోంది. ఇటీవలే ఆఫ్ లైన్ సర్వదర్శన టికెట్ల మంజూరు షురూ చేసిన టీటీడీ... తాజాగా దివ్యాంగులు, వృద్ధులకు శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1 నుంచి వృద్ధులు, దివ్యాంగుల దర్శనాలు పునరుద్ధరిస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. రోజుకు 1000 మంది చొప్పున ప్రత్యేక దర్శనం కల్పించనుంది. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు దర్శనానికి అనుమతించనున్నారు.


More Telugu News