గ‌డ్డం లేదా?.. అయితే, ఆఫీసుల‌కు రావొద్దు: ఆఫ్ఘ‌న్‌లో తాలిబన్ల కొత్త రూల్‌

  • కాబూల్‌లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను త‌నిఖీ చేసిన తాలిబన్లు
  • గ‌డ్డం గీసుకోవ‌ద్దంటూ హుకుం
  • సంప్ర‌దాయ దుస్తుల‌నే ధ‌రించాల‌ని ఆదేశం
ఆఫ్ఘ‌నిస్థాన్‌లో స‌రికొత్త పాల‌న ప్రారంభించిన తాలిబన్లు స‌రికొత్త రూల్స్‌ను అమ‌లు చేస్తున్నారు. బాలిక‌ల విద్య‌ను ఇప్ప‌టికే ర‌ద్దు చేసిన తాలిబన్లు.. తాజాగా పురుషుల‌పైనా కొత్త నిబంధ‌న‌లు విధిస్తున్నారు. ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప‌నిచేసే పురుషులు గ‌డ్డం లేక‌పోతే విధుల‌కు హాజ‌రు కావొద్దంటూ కొత్త రూల్ ప్ర‌వేశ‌పెట్టారు. ప్ర‌భుత్వ ఉద్యోగులైనప్ప‌టికీ పురుషుల‌కు గ‌డ్డం ఉండాల్సిందేన‌ని తేల్చిచెబుతున్న తాలిబన్లు.. గ‌డ్డం లేక‌పోతే వారిని ఉద్యోగాల్లో నుంచి తొల‌గించేందుకు కూడా వెనుకాడేది లేద‌ని తేల్చిచెప్పారు.

రాజ‌ధాని కాబూల్‌లోని ప‌లు ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను తాలిబన్ ప్ర‌భుత్వంలోని ప‌బ్లిక్ మొరాలిటీ మంత్రిత్వ శాఖ‌కు చెందిన అధికారులు సోమ‌వారం త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఉద్యోగుల‌కు డ్రెస్ కోడ్ త‌ప్ప‌నిస‌రి అని ప్ర‌క‌టించారు. గడ్డం గీసుకోవ‌ద్ద‌ని చెప్పిన అధికారులు.. సంప్ర‌దాయ దుస్తుల‌నే ధ‌రించాల‌ని హుకుం జారీ చేశారు.


More Telugu News