తమిళనాడులో భారీపెట్టుబడి పెడుతున్న లులూ గ్రూప్
- యూఏఈకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ లులూ గ్రూప్
- తమిళనాడులో రూ.3,500 కోట్ల పెట్టుబడికి ఒప్పందం
- దుబాయిలో సీఎం స్టాలిన్ సమక్షంలో ఒప్పందం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లులూ గ్రూప్ తమిళనాడులో భారీ పెట్టుబడులు పెడుతోంది. సుమారు రూ.3,500 కోట్లతో భారీ షాపింగ్ మాల్స్, హైపర్ మాల్స్, ఫుడ్ లాజిస్టిక్ పార్కులను ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేయనుంది.
ఈ మేరకు ప్రస్తుతం దుబాయి పర్యటనలో ఉన్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో తమిళనాడు ప్రభుత్వంతో లులూ గ్రూప్ ఓ ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టును 2024లోగా పూర్తి చేయనున్నట్లుగా ఆ గ్రూప్ తెలిపింది.
ఈ మేరకు ప్రస్తుతం దుబాయి పర్యటనలో ఉన్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సమక్షంలో తమిళనాడు ప్రభుత్వంతో లులూ గ్రూప్ ఓ ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్టును 2024లోగా పూర్తి చేయనున్నట్లుగా ఆ గ్రూప్ తెలిపింది.