పాక్ పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం.. రాజీనామా దిశ‌గా ఇమ్రాన్ ఖాన్‌

  • స‌భ‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టిన విప‌క్షాలు
  • ఈ నెల 31న తీర్మానంపై చ‌ర్చ‌
  • అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తుగా 160 మంది ఎంపీలు
  • అంత‌కుముందే రాజీనామా చేసే యోచ‌న‌లో ఇమ్రాన్‌
పొరుగు దేశం పాకిస్థాన్‌లో రాజ‌కీయంగా కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ స‌ర్కారుపై నేడు విప‌క్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టాయి. ఈ తీర్మానానికి అనుకూలంగా 160 మంది ఎంపీలు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు ఆ దేశ ప‌త్రిక‌లు క‌థ‌నాలు రాశాయి.

ఇదిలా ఉంటే.. సోమ‌వారం పార్ల‌మెంటు ముందుకు వ‌చ్చిన అవిశ్వాస తీర్మానంపై ఈ నెల 31న చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. అయితే ఆ తీర్మానం చ‌ర్చ‌కు వ‌చ్చేలోగానే ఇమ్రాన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేసే అవ‌కాశాలున్నాయ‌న్న వార్త‌లు కూడా గ‌ట్టిగానే వినిపిస్తున్నాయి. ఓ వైపున విపక్షాల‌తో పాటుగా త‌న సొంత పార్టీకి చెందిన ప‌లువురు ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసేందుకు సిద్ధ‌మ‌వ‌గా.. ప‌లు రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు మాత్రం ఇమ్రాన్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.


More Telugu News