ఏపీలో ఆర్ధిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ప్ర‌క‌టించండి.. రాజ్య‌స‌భ‌లో క‌న‌క‌మేడ‌ల డిమాండ్‌

  • అమ‌రావ‌తి స‌హా ఆర్థిక ప‌రిస్థితిపై కేంద్రానికి ఫిర్యాదు
  • రూ.48 వేల కోట్ల‌కు లెక్క‌లు చూప‌డం లేదని ఆరోపణ  
  • ఆర్టిక‌ల్ 360ని ప్ర‌యోగించాల‌ని ‌కనకమేడల డిమాండ్ 
సోమ‌వారం రాజ్య‌స‌భ స‌మావేశాల్లో టీడీపీ ఎంపీ క‌న‌కమేడ‌ల ర‌వీంద్ర కుమార్‌.. వైసీపీ స‌ర్కారుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాజ‌ధాని అమ‌రావ‌తిపై జ‌గ‌న్ స‌ర్కారు తీరు, రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్థితిపైనా క‌న‌క‌మేడ‌ల ప్ర‌స్తావించారు. రాష్ట్రంలో తక్షణమే ఆర్టికల్ 360ని ప్రయోగించి ఆర్ధిక అత్యవసర పరిస్థితిని విధించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా క‌న‌క‌మేడ‌ల మాట్లాడుతూ.. ''రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. రాష్ట్రంలో ఆర్ధిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ప్ర‌క‌టించండి. త‌క్ష‌ణ‌మే రాష్ట్రంలో ఆర్టిక‌ల్ 360ని ప్ర‌యోగించండి. శాస‌న స‌భ ఆమోదం లేకుండా రూ.1.11 ల‌క్ష‌ల కోట్ల‌ను ఖ‌ర్చు చేశారు. రూ.48 వేల కోట్ల‌కు లెక్క‌లు చూప‌డం లేదు. కోర్టుల తీర్పుల‌పై స‌భ‌లో చ‌ర్చ‌లు పెడుతున్నారు'' అంటూ ఆయ‌న ఏపీ స‌ర్కారు తీరుపై రాజ్య‌స‌భ వేదిక‌గా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అదే స‌మ‌యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు సంబంధించి వెన‌క్కు త‌గ్గాల‌ని ఆయ‌న కేంద్రానికి విన్న‌వించారు.


More Telugu News