విశాఖ రిఫైనరీ ఆధునికీకరణకు రూ.26,264 కోట్లు: కేంద్రం ప్రకటన
- విశాఖ రిఫైనరీ ఆధునికీకరణకు గతంలో రూ.20,928 కోట్ల అంచనా
- దానిని ఇప్పుడు రూ.26,264 కోట్లకు పెంచుతూ కేంద్రం ప్రకటన
- రాజ్యసభలో సాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం సమాధానం
పార్లమెంటు బడ్జెట్ మలి విడత సమావేశాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా అంశాలు ప్రస్తావనకు వస్తున్నాయి. వాటిలో చాలా అంశాల్లో తెలుగు రాష్ట్రాలు కోరినట్టుగా కేంద్రం ప్రకటనలు విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సోమవారం నాటి రాజ్యసభ సమావేశాల్లో ఏపీకి చెందిన ఓ అంశానికి సంబంధించి నిధులను పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
విశాఖ పరిధిలోని హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ఆధునికీకరణకు రూ.20,928 కోట్ల మేర వ్యయం అవుతుందని గతంలో కేంద్రం అంచనా వేసింది. అయితే తాజాగా ఈ వ్యయాన్ని రూ.26,264 కోట్లకు సవరిస్తున్నట్లు సోమవారం కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు జవాబిచ్చారు.