మోదీకి రఘురామరాజు లేఖ.. ఏపీ సీఎంను విచారించాలని డిమాండ్
- సీబీఐ, ఎస్ఎఫ్ఐవోతో విచారణకు డిమాండ్
- ఫోరెన్సిక్ ఆడిట్ కూడా జరపాలని వినతి
- విచారణ సమయంలో సీఎంనూ ప్రశ్నించాలని డిమాండ్
- ఆ దిశగా కొత్త నిబంధన పెట్టాలన్న రఘురామ
- ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపణ
వైసీపీ రెబల్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీబీఐ ఆర్థిక నేర విభాగంతో గానీ, లేదంటే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) విచారణ చేయించాలని రఘురామరాజు తన లేఖలో ప్రధానికి విన్నవించారు.
ఈ లేఖలో రఘురామరాజు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఏపీ ఆర్థిక స్థితిపై కాగ్ లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని కోరిన ఆయన.. సంబంధిత ఏజెన్సీ ద్వారా విచారణ చేపట్టాలని కోరారు. ఎస్ఎఫ్ఐవో, లేదంటే సీబీఐ ఆర్థిక నేర విభాగంతో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే ఏపీ ఆర్థిక వ్యవస్థపై ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని డిమాండ్ చేశారు.
ఇక ఏపీ ఆర్థిక పరిస్థితికి దారి తీసిన పరిణామాలను వివరించిన రఘురామరాజు.. ప్రభుత్వ బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలపైనా విచారణ చేపట్టాలన్నారు. కార్పొరేషన్ల ద్వారా ఎలా సేకరించారో విచారించాలన్న రఘురామరాజు.. అప్పులు తీసుకునేటప్పుడు ఏపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపణ చేశారు.
ఏపీ ఆర్థిక పరిస్థితిపై విచారణ జరిగే సమయంలో సీఎంను కూడా ప్రశ్నించేలా నిబంధన విధించాలని రఘురామరాజు డిమాండ్ చేశారు. అంతేకాకుండా అధికారులను కూడా విచారించాలన్న నిబంధన పెట్టాలని సూచించారు.