ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో మళ్లీ పాఠశాలలు ప్రారంభం

  • ఫిబ్రవరి 24 నుంచి రష్యా భీకర దాడులు
  • ఉక్రెయిన్ లో చాలా ప్రాంతాల ధ్వంసం
  • పెద్ద నగరాలను వదిలి చిన్న నగరాలపై పడిన రష్యా సేనలు
  • కీవ్ నుంచి రష్యా బలగాల నిష్క్రమణ!
  • ఆన్ లైన్ ద్వారా విద్యార్థులకు బోధన
ఉక్రెయిన్ పై దండయాత్రకు దిగిన రష్యా వ్యూహం మార్చింది. ఉక్రెయిన్ లోని పెద్ద నగరాలను వదిలి చిన్న నగరాలు, పట్టణాలను స్వాధీనం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఈ మేరకు తన దళాలను తరలిస్తోంది. కీవ్, చెర్నోబిల్ ప్రాంతాల నుంచి రష్యా దళాలు వెళ్లిపోయాయని ఉక్రెయిన్ వెల్లడించింది. 

ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. ఆన్ లైన్ ద్వారా విద్యాబోధన కొనసాగించనున్నారు. అయితే, ఫిబ్రవరి 24 నుంచి రష్యా భీకర  దాడులు చేస్తుండడం వల్ల ఉక్రెయిన్ లో సగం మంది పిల్లలు దేశం వీడి వెళ్లినట్టు ఐక్యరాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి. దాంతో, అందుబాటులో ఉన్న పిల్లలకే విద్యాబోధన చేస్తామని కీవ్ నగర మేయర్ తెలిపారు.


More Telugu News