రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్టు స్పష్టమవుతోంది: యనమల

  • ఏపీ ఆర్థిక పరిస్థితిపై యనమల స్పందన
  • ఆర్థిక అత్యయిక పరిస్థితి విధించాలని వెల్లడి
  • ఆర్టికల్ 360 ప్రయోగించాలని డిమాండ్
  • ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయనన్న యనమల
ఏపీ ఆర్థిక పరిస్థితిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. ఏపీలో ఆర్థిక అత్యయిక పరిస్థితి విధించాలని మరోసారి డిమాండ్ చేశారు. ఆర్టికల్ 360 తక్షణమే ప్రయోగించాలని ఈ సందర్భంగా యనమల కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర పరిస్థితిపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ప్రభుత్వ లొసుగులు బయటపడ్డాయనే వైసీపీ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. 

తానెప్పుడూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయలేదని అన్నారు. కాగ్ ప్రస్తావించిన నోటింగ్స్ ఆధారంగానే తాను వ్యాఖ్యలు చేస్తున్నట్టు యనమల స్పష్టం చేశారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థికమంత్రి కాగ్ నోటింగ్స్ పై జవాబివ్వడంలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందనేది దీన్నిబట్టి స్పష్టమవుతోందని తెలిపారు.


More Telugu News