ఉక్రెయిన్‌తో చర్చలపై రష్యా కీలక ప్రకటన
- ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం
- టర్కీ వేదికగా తాజా చర్చలు
- ఈ వారమే ఉంటాయన్న రష్యా
ఉక్రెయిన్, రష్యాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. అయితే యుద్ధం ఆగే దిశగా ఆదిలోనే మొదలైన చర్చల ప్రక్రియ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు విడతలుగా ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. ఈ క్రమంలో మరోమారు చర్చలకు ఇరు దేశాలు అంగీకరించాయి.
ఈ విషయాన్ని స్వయంగా రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రకటించింది. ఉక్రెయిన్‌తో ఈ వారంలో చర్చలు జరగడం ఖాయమేనని చెప్పిన రష్యా.. ఈ దఫా చర్చలు టర్కీలో జరగనున్నట్లుగా పేర్కొంది. అయితే ఆ చర్చలు సోమవారమే మొదలవుతాయన్న విషయంపై అనుమానం ఉన్నట్లు తెలిపింది.