31లోగా జగన్‌కు సమన్లు అందించాలి.. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశం
- హుజూర్ నగర్‌లో కోడ్ ఉల్లంఘించారని జగన్‌పై కేసు
- నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ
- జగన్‌కు ఇంకా సమన్లే అందలేదన్న ప్రభుత్వ న్యాయవాది
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుపై సోమవారం నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా జగన్ ఎందుకు హాజరు కాలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు.
న్యాయమూర్తి ప్రశ్నకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ, జగన్‌కు ఇంకా సమన్లే అందలేదని తెలిపారు. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ఈ నెల 31లోగా జగన్‌కు సమన్లు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆపై విచారణను వాయిదా వేశారు.