పుతిన్ తమ దేశంపై అణ్వాయుధాలతో దాడి చేస్తారేమోనని హడలిపోతున్న సగం మంది అమెరికన్లు!
- పుతిన్ అమెరికాపై దాడి చేస్తారని నమ్ముతున్న సగం మంది అమెరికన్లు
- ఉక్రెయిన్ పై అణుదాడి జరుగుతుందని భావిస్తున్న 60 శాతం మంది అమెరికన్లు
- సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసర్చ్ సర్వేలో అమెరికన్ల అభిప్రాయాలు
ఉక్రెయిన్ పై రష్యా భీకర యుద్ధాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా దాడులతో ఉక్రెయిన్ నామరూపాల్లేకుండా పోతోంది. లక్షలాది మంది ఉక్రేనియన్లు స్వదేశాన్ని వీడి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోతున్నారు. ఉక్రెయిన్ కు అమెరికా పూర్తి మద్దతును ఇస్తోంది. ఆయుధాలతో పాటు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.
ఈ నేపథ్యంలో, అమెరికా వైఖరి రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఏమాత్రం నచ్చడం లేదు. ఈ క్రమంలో, రష్యా తమపై దాడికి తెగబడుతుందేమోనని అమెరికన్లు భయంతో వణికిపోతున్నారు. రష్యా న్యూక్లియర్ ఫోర్సెస్ ను ఆ దేశాధ్యక్షుడు పుతిన్ అలర్ట్ గా ఉంచడం అమెరికన్ల భయాన్ని మరింత పెంచుతోంది. తమ దేశంపై రష్యా అణ్వాయుధాలతో దాడి చేస్తుందేమోనని సగం మంది అమెరికన్లు భయపడుతున్నట్టు ఓ పోల్ సర్వేలో స్పష్టమయింది.
తమ దేశంపై అణ్వాయుధాలతో రష్యా నేరుగా దాడికి తెగబడొచ్చని దాదాపు సగం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. ఈ పోల్ సర్వేను సెంటర్ ఫర్ పబ్లిక్ అఫైర్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించింది. మరోవైపు ఉక్రెయిన్ పై అణ్యాయుధాన్ని పుతిన్ ఉపయోగించచ్చని 10 మందిలో 9 మంది అమెరికన్లు నమ్ముతున్నారు. 10 మందిలో ఆరుగురు మాత్రం పక్కాగా అణ్వాయుధ ప్రయోగం జరుగుతుందని భావిస్తున్నారు.
పుతిన్ కంట్రోల్ కోల్పోయారని... తాను అనుకున్నది సాధించడానికి ఏది చేయడానికైనా వెనుకాడే స్థితిలో లేరని రాబిన్ థాంప్సన్ అనే రిటైర్డ్ రీసర్చర్ అన్నారు. పుతిన్ వద్ద కావాల్సినన్ని అణ్వాయుధాలు ఉన్నాయనే విషయాన్ని కూడా గుర్తు చేశారు.
ఈ సర్వేలో మరో ఆసక్తికర విషయాన్ని ప్రజలు వ్యక్తపరిచారు. ఉక్రెయిన్ పై రష్యా ఆక్రమణ చర్య... ప్రపంచంలో అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశాలను పెంచిందని 71 శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. ఉత్తర కొరియా నుంచి తమకు న్యూక్లియర్ ముప్పు పొంచి ఉండొచ్చనే భయాన్ని 51 శాతం మంది అమెరికన్లు వ్యక్తపరిచారు.