గౌతమ్‌రెడ్డిని నేనే రాజకీయాల్లోకి తీసుకొచ్చాను: సీఎం జగన్
- నా ప్రతి అడుగులో గౌతమ్‌రెడ్డి తోడుగా ఉన్నారు
- నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారు
- ఏపీకి పరిశ్రమలు తీసుకురావాలని తపన పడేవారన్న జగన్
నెల్లూరులో దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్‌రెడ్డికి జగన్ నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ, తన ప్రతి అడుగులో గౌతమ్‌రెడ్డి తోడుగా ఉన్నారని, తనను ఆయన ఎల్లప్పుడూ ప్రోత్సహించేవారని తెలిపారు. ఆయనను తానే రాజకీయాల్లోకి తీసుకువచ్చానని గుర్తుచేసుకున్నారు.
ఆరు శాఖలను గౌతమ్‌రెడ్డి చూసేవారని ఆయన తెలిపారు. ఏపీకి పరిశ్రమలు తీసుకురావాలని గౌతమ్‌రెడ్డి తపన పడేవారని, పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని అనేవారని జగన్ చెప్పారు. ఓ మంచి స్నేహితుడిని కోల్పోయానని, సంగం బ్యారేజ్‌కు 'మేకపాటి గౌతమ్‌రెడ్డి బ్యారేజీ' అనే పేరు పెడతామని ఆయన తెలిపారు.