ఆస్కార్ అవార్డ్స్ 2022.. ఉత్తమ నటీనటులు, ఇతర విజేతల వివరాలు ఇవిగో!
- ఉత్తమ చిత్రం - కోడా
- ఉత్తమ నటుడు - విల్ స్మిత్
- ఉత్తమ నటి - జెస్సికా ఛస్టెయిన్
ఆస్కార్ అవార్డుల వేడుకలు లాస్ ఏంజెలెస్ లోని ఐకానిక్ డాల్బీ థియేటర్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ 94వ అకాడెమీ అవార్డులకు హాలీవుడ్ తారలు తరలి వచ్చారు. రెజీనా హాల్, అమీ షుమర్, వాండా సైక్స్ లు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇక ఈ ఏడాది ఉత్తమ నటీనటులుగా విల్ స్మిత్, జెస్సికా ఛస్టెయిన్ ఎంపికయ్యారు. వీరిద్దరూ కూడా గతంలో అకాడెమీ అవార్డులు మిస్ అయిన వారే. గతంలో విల్ స్మిత్ రెండు సార్లు, జెస్సికా ఒకసారి ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయినప్పటికీ... అవార్డును మాత్రం అందుకోలేకపోయారు. ఈ సారి మాత్రం వీరిద్దరినీ ఆస్కార్ వరించింది.
ఆస్కార్ అవార్డు విజేతల వివరాలు:
ఉత్తమ నటుడిగా ఎంపికైన విల్ స్మిత్ విషయానికి వస్తే... 'వేర్ ది డే టేక్స్ యూ' అనే చిత్రంతో ఆయన తెరంగేట్రం చేశారు. నిర్మాతగా కూడా రాణించారు. ఎన్నో వైవిధ్యభరితమైన చిత్రాల్లో నటించిన స్మిత్... భారతీయ సినీ పరిశ్రమకు కూడా సుపరిచితులే. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే బాలీవుడ్ చిత్రంలో ఆయన ఓ అతిథి పాత్రలో మెరిశారు. ఈ ఏడాది ఉత్తమ నటుడు అవార్డు కోసం బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్, ఆండ్రూ గార్ ఫీల్డ్, డెంజిల్ వాషింగ్టన్, ఆండ్రూ గార్ ఫీల్డ్ వంటి దిగ్గజ నటులతో పోటీపడి విల్ స్మిత్ విజేతగా అవతరించారు.
ఉత్తమ నటి జెస్సికా ఛస్టెయిన్ విషయానికి వస్తే... 'జోలెన్' సినిమాతో ఆమె తెరంగేట్రం చేశారు. పలు సినిమాలతో ఆమె ప్రేక్షకులను అలరించారు. ఇప్పటికే ఆమె ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారు. ఈ సారి నికోల్ కిడ్ మన్, పెనిలోప్ క్రూజ్, క్రిస్టిన్ స్టివార్ట్, ఒలీవియా కోల్ మెన్ వంటి వారితో పోటీ పడి ఆస్కార్ గెలుచుకున్నారు.

- ఉత్తమ చిత్రం: "కోడా"
- బెస్ట్ లీడ్ యాక్టర్: విల్ స్మిత్ (“కింగ్ రిచర్డ్”)
- ఉత్తమ నటి: జెస్సికా ఛస్టెయిన్ (“ది ఐస్ ఆఫ్ టామీ ఫే”)
- ఉత్తమ సహాయ నటుడు: ట్రాయ్ కోట్సూర్ ("కోడా")
- ఉత్తమ సహాయ నటి: అరియానా డెబోస్ ("వెస్ట్ సైడ్ స్టోరీ")
- ఉత్తమ దర్శకుడు: జేన్ కాంపియన్ (“ది పవర్ ఆఫ్ ది డాగ్”)
- బెస్ట్ ఒరిజినల్ సాంగ్: (“నో టైమ్ టు డై”) బిల్లీ ఎలిష్, ఫిన్నియాస్ ఓ’కానెల్
- బెస్ట్ డాక్యుమెంటరీ: “సమ్మర్ ఆఫ్ సోల్”
- రచన (అడాప్టెడ్ స్క్రీన్ ప్లే): సియాన్ హెడర్ ("కోడా")
- రచన (ఒరిజినల్ స్క్రీన్‌ప్లే): కెన్నెత్ బ్రనాగ్ ("బెల్ఫాస్ట్")