ఒక చిత్రాన్ని మరో చిత్రంతో పోల్చవద్దు... ఇవేమీ ఎన్నికలు కాదు: కన్నడ హీరో యశ్
- యశ్ హీరోగా కేజీఎఫ్-2
- ట్రైలర్ విడుదల చేసిన రామ్ చరణ్
- ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యశ్
- తమ చిత్రాన్ని 'బీస్ట్' తో పోల్చవద్దని విజ్ఞప్తి
- తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా 'బీస్ట్'
- ఒక్కరోజు తేడాతో విడుదల కానున్న బీస్ట్, కేజీఎఫ్-2
కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్ చాప్టర్-2 చిత్రం ట్రైలర్ రిలీజైంది. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఈ ట్రైలర్ వీడియోను సోషల్ మీడియాలో ఆవిష్కరించారు. ఈ సినిమా ఎంత పవర్ ఫుల్ గా ఉండనుందో ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
కాగా, ఈ చిత్ర హీరో యశ్ మాట్లాడుతూ, తమ చిత్రాన్ని తమిళ హీరో విజయ్ నటించిన బీస్ట్ సినిమాతో పోల్చవద్దని విజ్ఞప్తి చేశారు. సినిమా రంగానికి విజయ్ సర్ ఎంతో చేశారు అంటూ కొనియాడారు. అయినా, ఒక చిత్రాన్ని మరొక చిత్రంతో పోల్చడానికి ఇవేవీ ఎన్నికలు కావని యశ్ స్పష్టం చేశారు. ఇది సినిమా రంగం... మనం రెండు సినిమాలనూ చూద్దాం... భారతీయ చిత్ర రంగంలో సంబరాలు చేసుకుందాం అని పిలుపునిచ్చారు.
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, కేజీఎఫ్-2 చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ఒక్క రోజు తేడాతో ఈ రెండు చిత్రాలు విడుదల అవుతుండడంతో వీటి మధ్య కలెక్షన్ వార్ ఖాయమని మీడియాలో కథనాలు వస్తున్నాయి.