సినిమా కోసం ఇంకేమైనా చేయాలా అని అడిగేవారు: పవన్ గురించి దర్శకుడు సాగర్ కె చంద్ర

  • పవన్ హీరోగా భీమ్లా నాయక్
  • ఇటీవలే విడుదల
  • సాగర్ కె చంద్ర దర్శకత్వంలో చిత్రం
  • తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్
పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో, భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్ర ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు. 

ఈ సినిమాకు పవన్ కల్యాణ్ అందించిన సహకారం మరువలేనిదన్నారు. పవన్ అగ్రహీరో అయినప్పటికీ దర్శకుడికి ఎంతో విలువనిచ్చే వ్యక్తి అని కొనియాడారు. భీమ్లా నాయక్ సమయంలో ఈ సినిమాకు సంబంధించి తాను ఇంకేమైనా అదనంగా చేయాలా? అని పవన్ కల్యాణ్ అడిగారని వెల్లడించారు. అంతేకాదు, మరో టేక్ చేయమన్నా చేసేందుకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారని, తాను చెప్పేది శ్రద్ధగా వినేవారని సాగర్ కె చంద్ర వివరించారు.


More Telugu News