కులం పేరిట దూషణలు.. నాన్ బెయిలబుల్ వారెంట్ కింద నటి, బిగ్ బాస్ ఫేం అరెస్ట్
- దళితులపై మీరా మిథున్ అభ్యంతరకర వ్యాఖ్యలు
- గత ఏడాదే అరెస్ట్.. బెయిల్ పై విడుదల
- విచారణలకు హాజరుకాని నటి
- తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చిన కోర్టు
కులం పేరుతో దూషించిన కేసులో తమిళనటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెను కేరళలో అదుపులోకి తీసుకున్నారు.
సినీ ఇండస్ట్రీకి సంబంధించిన దళిత నటులు, డైరెక్టర్లపై ఆమె గత ఏడాది అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. అక్రమ కార్యకలాపాలు, నేరాల్లో పాల్గొంటారు కాబట్టే దళితులు సమస్యల్లో ఇరుక్కుంటున్నారని, కారణం లేకుండా ఎవరూ వారిని ఏమీ అనరని వ్యాఖ్యానించింది. ఇలాంటి దళితులు, డైరెక్టర్లను ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది.
ఈ నేపథ్యంలోనే ఆమెపై గత ఏడాది సెప్టెంబర్ లో ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు పెట్టారు. అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కొన్ని విచారణలకు హాజరైన ఆమె.. మళ్లీ విచారణలకు గైర్హాజరైంది. దీంతో ఎగ్మూరులోని కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఆ ఆదేశాల నేపథ్యంలోనే పోలీసులు ఆమెను మరోసారి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.