బాకరాపేట రోడ్డు ప్రమాదం నా మనసును తీవ్రంగా కలచి వేసింది: పవన్ కల్యాణ్
- కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం మరింత విషాదకరం
- ఇటువంటి బస్సుల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి
- ఘాట్ రోడ్లలో ప్రయాణికుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
చిత్తూరు జిల్లా బాకరాపేటలో గత రాత్రి ఘోర బస్సు ప్రమాదం జరిగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన చేశారు. ఎంతో సంతోషంతో నిశ్చితార్థం వేడుకలకు అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుచానూరు వెళ్తున్న బృందం ప్రమాదానికి గురై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం, మరో 54 మంది తీవ్రంగా గాయపడడం మనసును తీవ్రంగా కలచి వేసిందని పవన్ చెప్పారు.
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం మరింత విషాదకరమని అన్నారు. ఇటువంటి బస్సుల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఘాట్ రోడ్లలో ప్రయాణికుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.