దంచికొట్టిన స్మృతి, షెఫాలీ, మిథాలీ.. దక్షిణాఫ్రికా ఎదుట కొండంత లక్ష్యం
- తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెలరేగిన బ్యాటర్లు
- మిథాలీ కెప్టెన్ ఇన్నింగ్స్
- గెలిస్తే నేరుగా సెమీస్‌కు
తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత అమ్మాయిలు దుమ్మురేపారు. మహిళల ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయారు. తొలుత స్మృతి మంధాన, షెఫాలీ వర్మ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించగా, ఆ తర్వాత కెప్టెన్ మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ కౌర్ సఫారీ బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి సఫారీలకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
మంధాన 84 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 71 పరుగులు చేయగా, షెఫాలీ వర్మ 46 బంతుల్లో 8 ఫోర్లతో 53, మిథాలీ రాజ్ 84 బంతుల్లో 8 ఫోర్లతో 68, హర్మన్‌ప్రీత్ కౌర్ 57 బంతుల్లో 4 ఫోర్లతో 48 పరుగులు చేశారు. సఫారీ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, మసబాట క్లాస్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, అయబొంగ ఖాక, చోలే ట్రయాన్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఇండియా మూడింటిలో గెలిచి ఆరు పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 8 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం ఆ స్థానంలో ఏడు పాయింట్లతో వెస్టిండీస్ ఉంది. రన్ రేట్ కూడా మైనస్‌లలో ఉండడంతో భారత్ నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంంది.