షారూక్ ఖాన్ పోస్ట్ చేసిన తన 8 ప్యాక్ లుక్ వైరల్
- కొత్త సినిమా కోసం లుక్ మార్చుకున్న షారుక్
- అభిమానులు ఖుషీ
- ప్రస్తుతం ‘పఠాన్’ సినిమాలో నటిస్తున్న హీరో
బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ పోస్ట్ చేసిన తన 8 ప్యాక్ లుక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. షారుక్ ఖాన్ తన కొత్త సినిమా కోసం ఇలా తన శరీరాకృతిలో మార్పులు చేసుకున్నాడు. షారుక్ కొత్త లుక్ పట్ల ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు. గతంలోనూ ఆయన 6 ప్యాక్ లుక్‌తో కనపడిన సినిమాలు ఉన్నాయి.
ఆయన వెండి తెరపై కనపడక చాలా కాలం అవుతోంది. చివరిసారిగా షారుక్ ‘జీరో’ సినిమాలో నటించాడు. ప్రస్తుతం ‘పఠాన్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 25న విడుదల కానున్న ఈ సినిమా యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ లో రూపుదిద్దుకుంటోంది.