మహిళల ప్రపంచకప్.. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో నిలకడగా ఆడుతున్న భారత్

  • దక్షిణాఫ్రికాతో తలపడుతున్న మిథాలీ సేన
  • తొలి వికెట్‌కు 91 పరుగులు జోడించిన స్మృతి-షెఫాలీవర్మ
  • 40 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధ సెంచరీ సాధించిన వర్మ
మహిళల ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా నిలకడగా ఆడుతోంది. దక్షణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో మిథాలీ సేన ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ సంయమనంతో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. 

షెఫాలీ వర్మ 40 బంతుల్లో 8 ఫోర్లతో అర్ధ సెంచరీ సాధించింది. మరోవైపు, క్రీజులో కుదురుకున్నాక స్మృతి కూడా దూకుడు పెంచింది. 4 ఫోర్లు, సిక్సర్‌తో 32 పరుగులు చేసింది. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న షెఫాలీ వర్మ.. ట్రైయాన్ బౌలింగులో పరుగు కోసం యత్నించి రనౌట్ అయింది. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిశాయి. భారత జట్టు వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది.


More Telugu News