సాటి మనిషి పట్ల సామరస్యంతో వ్యవహరించడం కూడా దేశరక్షణలో భాగమే: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • హైదరాబాదు వచ్చిన వెంకయ్యనాయుడు
  • స్ఫూర్తి ప్రదాత సోమయ్య పుస్తకావిష్కరణ
  • ధర్మాన్ని, భాషా సంస్కృతులను కాపాడుకోవడం దేశరక్షణేనని ఉద్ఘాటన
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాదులో పర్యటించారు. ఓ కార్యక్రమంలో స్ఫూర్తి ప్రదాత సోమయ్య అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయవాద భావనను విస్మరించిన వాదాలన్నీ మెల్లిమెల్లిగా ప్రాభవాన్ని కోల్పోతున్నాయని పేర్కొన్నారు. దేశ రక్షణ అంటే మన ధర్మాన్ని, భాషా సంస్కృతులను కాపాడుకోవడమేనని భాష్యం చెప్పారు. సాటి మనిషి పట్ల సామరస్యతతో వ్యవహరించడం కూడా దేశరక్షణలో భాగమేనని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. సోమేపల్లి సోమయ్య వంటి మహనీయుల జీవితాల నుంచి యువత స్ఫూర్తి పొందాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 

1927లో ప్రకాశం జిల్లా పల్లామిల్లి గ్రామంలో జన్మించిన సోమేపల్లి సోమయ్య... ఆపై కుటుంబంతో పాటు గుంటూరు జిల్లా తెనాలి వచ్చేశారు. కాలక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.
.


More Telugu News